పాలేరుకు మూడేళ్లలోపు ఇందిరమ్మ ఇండ్లు : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

పాలేరుకు మూడేళ్లలోపు ఇందిరమ్మ ఇండ్లు : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి
  • త్వరలోనే అర్హులైన వారందరికీ రేషన్ కార్డు, పెన్షన్

కూసుమంచి, వెలుగు: పాలేరులో మూడేళ్లలోపు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. పాలేరు గ్రామంలో కల్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కొద్దిరోజుల్లోనే అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్లను అందిస్తామని తెలిపారు. 

వచ్చేనెల నుంచి రైతు రుణమాఫీ అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల కోరికలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు. మంత్రి వెంట రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్​ రాయల నాగేశ్వరరావు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు.