ఖమ్మం రూరల్, వెలుగు : రాష్ట్రంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలంలోని సత్యనారాయణపురం, ఏదులాపురం, గొల్లగూడెం, బారుగూడెం, కొండాపురం, తల్లంపాడు, పొన్నేకల్లు, మద్దులపల్లి, తెల్దారుపల్లి, గుర్రాలపాడు, వెంకటగిరి, గుదిమళ్ల, నంద్యతండా, ఇందిరమ్మ కాలనీ , రాజీవ్ గృహకల్ప కాలనీల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు 50 వేలకు పైగా మెజార్టీ ఇచ్చి గెలిపించినందున పాలేరు ప్రజలకు కావల్సిన ప్రతీ పనిని తాను చేసి చూపిస్తానని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేశారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -పేదల ప్రభుత్వంలో ప్రజలు కోరిన కోరికల్లో అన్నింటినీ నెరవేర్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం సిటీ -చుట్టూ గ్రామాల అభివృద్ధి జరిగినప్పటికీ తెల్దారుపల్లిలో అభివృద్ధి జరగలేదన్నారు. త్వరలోనే అన్ని సీసీ రోడ్లు వేయిస్తామని చెప్పారు. గ్రామాల్లో గంజాయి అమ్మే వారు ఎంతటివారైనా వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్కశేఖర్గౌడ్, తల్లంపాడు మాజీ సర్పంచ్శివారెడ్డి, తమ్మినేని నవీన్, సీపీఐ నాయకులు దండి సురేశ్, రంగారావు, అంబటి సుబ్బారావు, బండి జగదీశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ అంబటి ఈశ్వర్, సప్పిడి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
వెబ్సైట్ ప్రారంభం
ఖమ్మం టౌన్ : ఖమ్మంలో ఈనెల 18 నుంచి 20 వరకు జరిగే టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర మూడవ మహాసభల్లో భాగంగా రూపొందించిన వెబ్ సైట్ ను శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టెకోల రామనారాయణ, ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకటరావు, ఖదీర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్, సామినేని మురారి, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష,కార్యదర్శులు ఆవుల శ్రీనివాసరావు, కనకం సైదులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.