జీపీ సెక్రటరీలు లోకల్​గానే ఉండాలి : పొంగులేటి శ్రీనివాస రెడ్డి

జీపీ సెక్రటరీలు లోకల్​గానే ఉండాలి : పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • డిసెంబర్ చివరి లోపు రుణమాఫీ నిధులు 
  • రాష్ర్ట రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కూసుమంచి,వెలుగు :  పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో తిరుమలాయపాలెం మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై   చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం రైతుల  సమస్యలను పరిష్కరించాలంటూ సీపీఎం నాయకులు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. తర్వాత లోక్యాతండా గ్రామానికి చెందిన జర్పుల మోతీలాల్ కుమారుని వివాహానికి హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

డిసెంబర్ చివరి లోపు రుణమాఫీ నిధులు 

డిసెంబర్ చివరి నాటికి రైతు రుణమాఫీ పెండింగ్ నిధులు విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన కాల్వల మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాలేరు అసెంబ్లీ పరిధిలో పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. రైతులకు వరద సహాయం అందించేందుకు ఎకరానికి 600 రూపాయల లంచం ఇవ్వాలని కొంత మంది అధికారులు అడిగినట్లు సమాచారం అందిందని, దీనిపై సమగ్రంగా విచారించి నివేదిక సమర్పించాలని ఆర్డీఓను ఆదేశించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు ప్రతివారం కనీసం రెండు సార్లు ప్రతి గ్రామానికి వెళ్ళాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

వీరభద్ర స్వామి ఆలయంలో మంత్రి పూజలు

కల్లూరు  : కల్లూరు ఎన్ఎఎస్పీ క్రాస్ రోడ్ సమీపంలోని శ్రీభద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సందర్శించారు. కార్తీక మాసం   తొలి కార్తీక సోమవారం కావడంతో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రితోపాటు రాజేంద్ర గౌడ్ ఉన్నారు. 

కొత్తగూడెంలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న అండర్​ 17 బాల, బాలికల రాష్ట్ర స్థాయి టేబుల్​ టెన్నిస్​ పోటీలు సోమవారం ముగిశాయి. టీం చాంపియన్​ షిప్​ విభాగంలో హైదరాబాద్​ జట్లు విజయంసాధించాయి. రెండో స్థానంలో రంగారెడ్డి జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో మూడో స్థానంలో ఖమ్మం టీం నిలిచింది.