- తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం
- ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలె
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం: కేసీఆర్ కు ఇంగిత జ్ఞానం లేదని, ఆయన తీరును సమాజం హర్షించదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఖమ్మంలో జరిగిన పట్టభ ద్రు ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపును కేసీఆర్ ముక్కు నెలకు రాసినా ఆపలేరన్నారు. లక్షా పాతికవేల మెజారిటీ తో ఘన విజయం సాధిస్తారని అన్నారు.
తీన్మార్ మల్లన్నపై 100 కేసులు ఉన్నాయని బీఆర్ఎస్ వారు అంటున్నారని, కేసీఆర్ అరాచకాలను ప్రశ్నించినందుకు జైల్లో పెట్టి పైశాచికానందం పొందారని మండి పడ్డారు. తీన్మార్ మల్లన్నను గెలిపించి, ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టి చట్టసభకు పంపాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రజలకు చేసింది ఏమీ లేదని విమ ర్శిం చారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను విస్మరించారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని, ఈ లోకసభ ఎన్నికల్లో ఉన్న కొద్ది సీట్లూ ఊడతాయని చె ప్పారు.