రెవెన్యూ ఉద్యోగుల ప్రమోషన్లు​ క్లియర్​ చేస్తాం : పొంగులేటి శ్రీనివాస​రెడ్డి

రెవెన్యూ ఉద్యోగుల ప్రమోషన్లు​ క్లియర్​ చేస్తాం : పొంగులేటి శ్రీనివాస​రెడ్డి
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ ​ప్రమోషన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన మాట్లాడారు. పెండింగ్​ ప్రమోషన్స్​ను దసరాలోపే ఇచ్చేలా ఆఫీసర్లతో మాట్లాడుతానన్నారు. జిల్లాలో అర్హులైనవారికి  ప్రమోషన్లు ఇవ్వాలని  కలెక్టర్​కు సూచించారు. ఏఈవోల పని ఒత్తిడిపై అగ్రికల్చర్​ ప్రిన్సిపల్​ సెక్రటరీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 

సింగరేణి ప్రాంతంలో దసరా పండుగను మరింత ఘనంగా చేసుకోనున్నారని, రూ. 796కోట్లు లాభాల్లో వాటాగా కార్మికులకు ఇచ్చామని తెలిపారు.ఈ ప్రోగ్రాంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్​ జితేశ్​వి పాటిల్, ఇరిగేషన్​ డెవలప్​మెంట్​కార్పొరేషన్​ చైర్మన్​ మువ్వా విజయ్​ బాబు, అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్, అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, మహిళా, శిశు సంక్షేమ అధికారి విజేత, టీఎన్​జీవో నేతలు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు నెరవేర్చుతా

కూసుమంచి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతానని మంత్రి పొంగులేటి తెలిపారు. తిరుమలాయపాలెం మండలంలో జల్లేపల్లిలోనూతన జీపీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్​లో లబ్ధిదారులకు సీఎంఆర్​పీ, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 

 ధైర్యంగా ఉండండి

తల్లాడ : తల్లాడ మండలం రంగాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ యరమల వెంకటేశ్వర రెడ్డి ఇటీవల మృతిచెందగా మంత్రి పొంగులేటి మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వెంకటేశ్వర రెడ్డి ఫొటోకు పూలమాల వేసిన నివాళులర్పించారు.  పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

మానవత్వం చాటుకున్న మంత్రి 

ఖమ్మం  రూరల్ : రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి ఆసుపత్రికి తరలించి మంత్రి పొంగులేటి మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం రూరల్ కరుణగిరి బైపాస్ రోడ్డు లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలాయపాలెం మండల పర్యటనను ముగించుకుని సాయంత్రం ఖమ్మంలోని క్యాంపు ఆఫీసుకు వస్తున్న మంత్రి గమనించి బాధితులకు హెల్ప్​ చేశారు. తన ఎస్కార్ట్ వాహానాన్ని ఇచ్చి ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా బాధితున్ని ఆసుపత్రికి తరలించారు.