- పొంగులేటిపై బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్
హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని నారాయణపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో కాసేపు గడిపారు. తెల్లచొక్కా, తెల్ల లుంగీలో పచ్చని పంట పొల్లాల్లో కలియతిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించారు. స్థానిక రైతులతో ముచ్చటించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్లో పంచుకున్నారు. కాగా పొంగులేటి ట్వీట్పై బీఆర్ఎస్ సెటైరికల్ పోస్ట్ పెట్టింది. ‘మనది అయితే వ్యవసాయక్షేత్రం అనాలి.. కేసీఆర్ గారిది అయితే ఫాం హౌస్ అనాలి’ అని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.