వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి

వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి

రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు. పాలేరు ఏటి ఉద్ధృతికి ధ్వంసమైన కట్టడాలను, గండిపడిన కాలువల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. పాలేరు జలాశయం వద్ద సాగర్ ఎడమ కాలువకు పడిన భారీ గండిని ఆయన పరిశీలించారు.

ALSO READ : ఎన్ని ఇబ్బందులు వచ్చినా రుణమాఫీ విషయంలో రాజీపడం

రైతులు అధైర్య పడొద్దు

వరదల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులు ఎవరూ అధైర్య పడవద్దని,ప్రభుత్వం వారిని అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి నాలుగు రోజుల్లో నీటి విడుదలకు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వరదల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లను అధికారులు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపిన మంత్రి, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు కూడా వెంటనే పూర్తి చేయిస్తామని అన్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఆయన వెంట జిల్లా జన వనరుల శాఖ అధికారులు ఉన్నారు.