ఖమ్మం రూరల్/కుసుమంచి, వెలుగు : నియోజకవర్గంలోని అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం రూరల్ మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనులు చేశారు. గూడూరుపాడులో పల్లె దవాఖానాను ప్రారంభించారు.
తనగంపాడులో సీసీ, బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యకరమంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ హేమలత, డీఎంహెచ్‌వో హేమలత, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి, ఎం.శ్రీనివాసరావు, మిషన్ భగీరథ ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
-
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
కూసుమంచి మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 132 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, ఆర్డీవో గణేశ్‌తో ఆక్రమణకు గురైన అసైన్డ్ భూములు, చెరువు శిఖం భూముల విషయాలపై చర్చించారు. జుజ్జల్రావుపేటలో మాధురి వెంకటనర్సమ్మ మృతి చెందడంతో మంత్రి ఆమె ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.