తెలగాణ వ్యాప్తంగా తహశీల్దార్లతో గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షామీర్ పేట నల్సార్ యూనివర్శిటీ సమావేశం అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ధరణి వల్ల రైతులు చాలా ఇబ్బంది పడ్డారని రెవిన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసి .... పేదవారి పక్షాన ఉంటుందని మంత్రి అన్నారు. ధరణి పోర్టల్ తో ఇబ్బంది పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
మార్పు రావాలి.. ఇందిరమ్మ రాజ్యం కావాలంటూ... సామాన్య ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఎలా సర్వీస్ చేయాలో తహశీల్దార్లకు పూర్తి అవగాహన ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో పేరుకు మాత్రమే తహశీల్దార్ (MRO) కార్యాలయాలని.. ఎలాంటి వసతులు లేకుండా ఉండేవనన్నారు. కనీసం వాచ్ మెన్ కూడా ఉండేవారు కాదన్నారు.
స్టేషనరీ ఖర్చులు.. వాహన సౌకర్యం .. ఇతర సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తహశీల్దార్ కార్యాలయాలకు కొత్త బిల్డింగ్లు కట్టే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు, ప్రజా ప్రతినిథులు.. మంత్రులు.. అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి పేదల సమస్యలు పరిష్కరించాలన్నారు. అందరూ కలిసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పని చేస్తే..ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. తహశీల్దార్ పెట్టే సంతకం ముఖ్యమే తెలుసంటూ... కొంతమంది ఉద్యోగుల వల్ల రెవిన్యూ వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందన్నారు.
Also Read :- కాకా వెంకటస్వామి మాలల అభివృద్దికి కృషి చేశారు
ఎవరైనా తహశీల్దార్ ఫిర్యాదు చేస్తే కలెక్టర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేయవద్దని తర్వలో ఆదేశాలు జారీ అవుతాయన్నారు. భూముల విషయంలో గతంలో ఏమైనా అవకతవకలు ఉంటే... పేదవారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్లు 90 శాతం మంది రైతు కుటుంబం నుంచి వచ్చారని... వాళ్ల సాధక బాధలు మీకు తెలిసే ఉంటాయన్నారు.
రేవంత్ సర్కార్ లో పేదలకు మంచి చేసేందుకు మీశీనన్న ఇటు అధికారులకు.. అటు ప్రజలకు అందుబాటులో ఉంటానని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.