
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ లో భూభారతి చట్టం అవగాహన సదస్సుకు చీఫ్ గెస్ట్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నారు. ధరూర్ లో ఏర్పాటు చేసిన సభా స్థలిని, ఏర్పాట్లను కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు.
సభకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం కలిగినా ఇబ్బంది లేకుండా జనరేటర్ ను అందుబాటులో ఉంచాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.