- వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి
హనుమకొండ, వెలుగు: రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, ఇన్ఫర్మెషన్, పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం వరంగల్ నగరానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు కాకతీయ యూనివర్సిటీకి చేరుకోనున్న ఆయన ముందుగా వర్సిటీలో నిర్మించిన 'కె-హబ్'ను ప్రారంభించనున్నారు. అనంతరం క్యాంపస్ లోనే పీవీ నరసింహరావు నాలెడ్జ్ సెంటర్, ఎస్టీ విమెన్స్ హాస్టల్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లో వీసీ చాంబర్, హాస్టల్ డైనింగ్ హాల్, సీసీ రోడ్లు, ఆర్ట్స్ కాలేజీలో ఎంబీఏ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ ను ప్రారంభించనున్నారు.
దాంతో పాటు కాకతీయ యూనివర్సిటీలో ఒక లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, మరో దివ్యాంగుల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ వాల్, రోడ్డు వైడెనింగ్ కు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఆ తరువాత ఉర్సు గుట్ట వివిధ జంక్షన్ల బ్యూటిఫికేషన్, బాల సముద్రం చిల్డ్రన్స్ పార్కు, ఎంజీఎం పీడియాట్రిక్ వింగ్లో ప్లే వే ఎక్విప్మెంట్, గోవిందరాజుల గుట్ట వద్ద వాటర్ ట్యాంక్, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు వరంగల్ తూర్పులో ఎస్డీఎఫ్ కింద చేపట్టబోయే వివిధ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వరంగల్ నుంచి భద్రాచలం వెళ్తారు.