రాజకీయ కురువృద్ధుడు, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత గడ్డం వెంకటస్వామికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు అభిమానులు, నేతలు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న కాకా విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. కాకాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి శంకర్ రావు, పలు పార్టీల నేతలు, దళిత సంఘాల లీడర్లు, కాకా అభిమానులు పాల్గొన్నారు.
కాకా 10 వ వర్థంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. కాకా వర్థంతిని అధికారికంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గరున్న కాకా విగ్రహం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసింది సర్కార్. కాకా విగ్రహానికి నివాళులు అర్పించారు కాకా కుమారుడు చెన్నూరు MLA వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజా, ఇతర కుటుంబ సభ్యులు.