తెలంగాణలోని మాజీ సర్పంచులకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్

హైదరాబాద్: గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చిట్చాట్ లో భాగంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. వంద ఎలుకలు తిన్న పిల్లి మాదిరి బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో మాజీ సర్పంచుల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలనలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణం అయిన వారే మద్దతుగా ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సర్పంచుల బకాయిలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని, పొలిటికల్ పార్టీల ట్రాప్లో పడొద్దని ఆయన సూచించారు.

రాష్ట్రంలో సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరమా లేదని, సర్పంచులకు తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికి తెలుసని, ఓపిక పడితే మార్చి నెలాఖరు లోగా బకాయిలు చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

ALSO READ : ఈడీ, ఐటీ సోదాలపై ఫస్ట్ టైం మాట్లాడిన మంత్రి పొంగులేటి

కిషన్ రెడ్డి తమను ప్రశ్నించే ముందు గత పదేండ్ల నుంచి చేసిందేంటో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పర్యాటక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పది ఏళ్ల నుంచి చేసిందేంటో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని మంత్రి పొన్నం సూటిగా ప్రశ్నించారు.

అమర వీరుల స్థూపం దగ్గర చర్చకు రావాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డికి తెలంగాణ DNA లేదని, DNA ఉంటే తెలంగాణకు ఏమైనా చేసేవారని విమర్శించారు. వరద నష్టం నివేదిక కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్కు నివేదించామని, పది వేల కోట్ల నష్టానికి 400 వందల కోట్లు ఇచ్చారని పొన్నం వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాలకు బీఆర్ఎస్ రెచ్చకొట్టే కార్యక్రమం ముగిశాక వెళతామని, బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.