భూఅక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి : పొన్నం ప్రభాకర్  

  •      సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్రమాలపై మంత్రి పొన్నం సీరియస్ 

రాజన్నసిరిసిల్ల, వెలుగు : జిల్లాలో భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్పీని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  ఆదేశించారు. మంగళవారం సిరిసిల్లలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 కు ముందు ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉండి, కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. ఆ స్థలాలను విద్యాసంస్థలు, ఇతర ప్రజా అవసరాలకు వినియోగించాలన్నారు.

కొందరు రాజకీయ, ఆర్థిక బలంతో సామాన్యుల ప్లాట్లు, ఇండ్ల స్థలాలను కబ్జా చేశారని, వాటిపై సరైన ఆధారాలతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు.  నేతన్నలకు ప్రభుత్వం దన్నుగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. వారికి 365 రోజులు పని కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

వర్కర్ టూ ఓనర్ పథకానికి లబ్ధిదారులను గుర్తించేందుకు నేరుగా కార్మికులు, కార్మిక సంఘాలు ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. రివ్యూలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మేడిపల్లి సత్యం, కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.