జనవరి 26 నుంచి రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా
భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుండి ప్రజలు ఎల్లమ్మ చెరువుకు వచ్చేలా అభివృద్ధి చేసుకుంటున్నాం అని అన్నారు. ప్లాన్ అఫ్ యాక్షన్ కింద ప్రభుత్వ స్థలాలను గుర్తించి ట్రాఫిక్, పార్కింగ్ తదితర సమస్యలు తీర్చేందుకు అన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ALSO READ : సాగు చేయని భూములకు రైతుబంధు.. రూ. 21 వేల 283 కోట్లు వృథా
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రైతు భరోసా కింద గతంలో ఉన్న రూ.10 వేలను ఇప్పుడు 12 వేలకు పెంచామని తెలిపారు. భూమిలేని రైతు కుటుంబానికి, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ కానుకగా ఇస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడంలో కాంగ్రెస్ కు అనుభవం ఉందని, ప్రజలకు ఎలా సేవ చేయాలని ఆలోచిస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అని తెలిపారు.