సియోల్లో చెంగిచియాన్ నదిని సందర్శించిన మంత్రులు

సియోల్లో  చెంగిచియాన్ నదిని  సందర్శించిన మంత్రులు


హైదరాబాద్: సౌత్ కొరియాటూర్లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ సియోల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్ ని సందర్శించింది. అనంతరం చియంగు నదిని విజిట్ చేసింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కోసం సియోల్లో యాన్, చీయంగ్ చూ నదుల అభివృద్ధి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే. మాపో ప్లాంట్ లో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల రీసైక్లింగ్ కు  వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీని సియోల్ నగరపాలక సంస్థ వాడుతోంది. పర్యావరణంపై దుష్ప్ర భావం పడకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. మరో 10 ఏండ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుంచి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

 ఈ నేపథ్యంలో షూపో ప్లాంట్ పనితీరును అధ్యయనం చేసేందుకు సియోల్లో మంత్రులు, అధికారులు పర్యటి స్తున్నారు. బృందంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్, ఎమ్మెల్యే కాలే యాదయ్య, పురపాలక శాఖ ము ఖ్యకార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ అధికా రులు ఉన్నారు. 

ALSO READ | అందుబాటులోకి ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ ; ప్రారంభించిన ఉపముఖ్యమంత్రి భట్టి

ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ సియోల్, హైదరాబాద్ నగర నమూనాలు ఒకేలా ఉంటాయని తెలిపారు. సియోల్లో సుమారు 10వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి సిటీలోని 4 వైపులకు తరలిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్లో దాదాపు 8వేల మెట్రిక్ టన్నులు సేకరించి ఒకే వైపునకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇటువంటివి నగరంలో నాలుగు ప్లాంట్లను ని ర్మించేలా ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోందని పేర్కొన్నారు.