బీజేపీ, బీఆర్​ఎస్​ కలిసి సర్కారును బద్నాం చేస్తున్నరు : పొన్నం ప్రభాకర్

బీజేపీ, బీఆర్​ఎస్​ కలిసి సర్కారును బద్నాం చేస్తున్నరు : పొన్నం ప్రభాకర్
  • ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

చొప్పదండి, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీఆర్​ఎస్​, బీజేపీ పార్టీలు ఏకమయ్యాయని బీసీ, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్  ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి నరేందర్​రెడ్డికి మద్దతుగా చొప్పదండి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. 

హామీ ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వానికి, పట్టభద్రులకు వారధిగా పని చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ జిల్లా వర్కింగ్​ ప్రెసిడెంట్​ కోమటిరెడ్డి పద్మాకర్​రెడ్డి, మండల అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్​రెడ్డి, ఏఎమ్​సీ చైర్మన్​ కొత్తూరి మహేశ్​​, పట్టణ అధ్యక్షులు చందు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగయ్య గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.