అర్టీసీ బస్సులో పొన్నం ప్రయాణం

అర్టీసీ బస్సులో పొన్నం ప్రయాణం
  •     బైక్​ డ్రైవ్​ చేసిన మంత్రి  

వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాష్ర్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్​ అది శ్రీనివాస్​ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. మొదట తిప్పపూర్​బస్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు మంత్రి పొన్నం బైక్​ నడపగా..వెనకాల ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే​ అది శ్రీనివాస్​ కూర్చున్నారు. ఆలయ సమీపంలో ఓ హోటల్​లో టీ తాగుతూ పలువురితో ముచ్చటించారు. పక్కనే ఫొటో స్టూడియోలో ఫొటోలు దిగారు. తర్వాత ఆటోలో తిప్పాపూర్ ​బస్టాండ్​వరకు చేరుకున్నారు. అక్కడ అర్టీసీ బస్సు ఎక్కి టికెట్​కొని సిరిసిల్ల వరకు ప్రయాణం చేశారు. సిరిసిల్ల పాత బస్టాండ్​లో కేకే మహేందర్​ రెడ్డి తో కలిసి ఛాయ్​ తాగారు. బస్సులో ప్రయాణం చేస్తు న్నప్పుడు మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ  తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీం బాగుందని కితాబు ఇవ్వడంతో చిరునవ్వు నవ్వి కృతజ్ఞతలు తెలిపారు.