క్యాంపు ఆఫీసులో సత్యనారాయణ వ్రతం

క్యాంపు ఆఫీసులో సత్యనారాయణ వ్రతం

సిద్దిపేట (హుస్నాబాద్‌‌), వెలుగు : హుస్నాబాద్ క్యాంపు ఆఫీసులో మంగళ వారం కార్తీక మాసం సందర్భంగా  మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు  సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. హుస్నాబాద్  ప్రజల సంక్షేమం కోసం  శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్టు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 

రాబోయే కాలంలో ఈ ప్రాంతమంతా సుభిక్షంగా పాడి పంటలతో మంచి వర్షాలతో ఉండాలని ఆ సత్యనారాయణ స్వామి వేడుకున్నట్టు మంత్రి తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, కార్యకర్తలు ,ముఖ్య నేతలు పాల్గొన్నారు.  కరీంనగర్ , సిద్దిపేట జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి,  మిక్కిలినేని మను చౌదరి, అడిషనల్ కలెక్టర్లు  హుస్నాబాద్ క్యాంప్ ఆఫీసులో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి ఒడితల ప్రణవ్ , ఇతర ముఖ్య నేతలు వేలాది గా హుస్నాబాద్ ప్రజలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.