- రాష్ర్ట మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలను కోరారు. హనుమకొండ జిల్లా హుస్నాబాద్ సెగ్మెంట్ భీమదేవరపల్లి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పర్యటించారు. ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సామల లింగమూర్తి కుటుంబాన్ని పరామర్శించారు. రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్న మహిళతో ముచ్చటించారు.
అటువైపుగా పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సమగ్ర కుల గణన ఇంటింటి కుటుంబ సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్స్ తో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల కులగణన సర్వే ప్రారంభించామన్నారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడమ్ లింగమూర్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ ముఖర్జీ, ఊసకోయిల ప్రకాశ్, చిట్టంపెల్లి ఐలయ్య, గజ్జెల రమేశ్, పోగుల శ్రీకాంత్,సమ్మయ్య, ప్రకాశ్ ,రాజు,స్వర్ణలత, మంజుల తదితరులు పాల్గొన్నారు.