త్వరలోనే ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ: మంత్రి పొన్నం ప్రభాకర్

త్వరలోనే ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్: త్వరలో టీజీఎస్ ఆర్టీసీలో 3వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కేంద్రంగా 33 నూతన ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు మంత్రి పొన్నం అనంతరం ఆయన మాట్లాడుతూ..  తెలంగాణలో 500 కొత్త బస్సులను ప్రారంభిస్తాం.. తొలుత  కరీంనగర్ లో 33 బస్సులను ప్రారంభించామన్నారు. 

తెలంగాణలో ప్రజాప్రభుత్వం, మహిళల ప్రభుత్వం నడుస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటివరకు టీజీఎస్ ఆర్టీసలో 92కోట్ల ఉచిత మహిళా టికెట్లు పంపిణీ చేశామన్నారు. 3వేల 200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభాత్వానిది అన్నారు. 

త్వరలో టీజీఎస్ ఆర్టీసీలో 3వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా  నూతన ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్ సీ, కారుణ్య నియామకాలు పైన దృష్టి పెడుతామన్నారు మంత్రి పొన్నం.

ALSO READ : రోడ్డెక్కిన 35 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు

హైద్రాబాద్ ఔటర్ రింగ్ పరిధిలో డీజిల్తో నడిచే బస్సులను పూర్తిగా తగ్గించి కాలుష్యాన్ని అరికట్టాలని సీఎం సూచించారు.. ఇందుకు అనుగుణంగా టీజీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.