నష్టపోయిన గౌడన్నలను ఆదుకుంటాం : మంత్రి పొన్నం

నష్టపోయిన గౌడన్నలను ఆదుకుంటాం : మంత్రి పొన్నం

తంగళ్లపల్లి, వెలుగు:  తాటి, ఈత వనం కాలిపోయి నష్టపోయిన గౌడ కులస్తులను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ భరోసా ఇచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు శివారులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో తాటి, ఈత చెట్లు కాలిపోయాయి. సంఘటనా స్థలాన్ని శుక్రవారం మంత్రి పొన్నం,  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. గౌడ కులస్తులు ఎవరూ కూడా అధైర్య పడొద్దని అండగా ఉండి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌‌చార్జి కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు టోనీ, లీడర్లు పాల్గొన్నారు.