ఆర్థిక ఇబ్బందులున్నా స్కీమ్ లు ఆపడం లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్థిక ఇబ్బందులున్నా స్కీమ్ లు ఆపడం లేదు : మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట(హుస్నాబాద్),వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పాత స్కీమ్ లతో పాటు కొత్త స్కీమ్ లను అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించాలన్నారు.

పార్టీ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్రుడిని ప్రేమతో పలకరించి ఓటు వేసే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఉద్యోగాల భర్తీ గురించి వివరించాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి హుస్నాబాద్ నియోజకవర్గ నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర  లైబ్రరీ చైర్మన్ రియాజ్, జిల్లా చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివ్వయ్య, నాయకులు శ్రీరామ్, సుధాకర్, జయరాజ్, శంకర్ ఉన్నారు.