పార్టీలకతీతంగా ఎవరు అక్రమాలకు పాల్పడినా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ స్పోర్ట్ స్కూళ్లో జరిగిన జాతీయ క్రీడాదినోత్సవ వేడుకల్లో పొన్నం మాట్లాడారు. కరీంనగర్ అర్బన్, సబ్ అర్బన్ గ్రామాల్లో ఆక్రమలు తమ దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షిస్తూ సామాన్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు పొన్నం. రాష్ట్ర స్థాయిలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణఫై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి ఆక్రమ రవాణా చేసేవారిపై పీడీ యాక్టులు పెడతామని హెచ్చరించారు.
Also Read:-దుర్గం చెరువుపై రెవెన్యూ ఫోకస్
కరీంనగర్ లోని స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు పొన్నం. స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలకు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాలను మంజూరు చేస్తున్నామని చెప్పారు అవినీతికి నిలయంగా మారిన ఈ ప్రాంతంలో అనేక మార్పులు, చేర్పులు చేపట్టామన్నారు..