బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కులాల వారిగా ఐక్యంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉప్పల్ బగాయత్ లో జరిగిన దేవాంగ కుల సామూహిక వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనంలో పొన్నం పాల్గొన్నారు. బీసీలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటికొచ్చే సర్వే అధికారులకు పూర్తి వివరాలు తెలిపి సహాకరించాలని సూచించారు పొన్నం ప్రభాకర్.
ఎన్యుమరేటర్స్ రాకపోతే పిలిచి సర్వే చేయించుకోవాలి
మన్సూరాబాద్ ఎంఈ రెడ్డి ఫంక్షన్ హల్ లో పెరిక కుల(పుర గిరి క్షత్రియ)కార్తీక వనభోజనాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పెరిక కులస్తుల కార్తీకమాస వనభోజన ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశాలు కుల ఐక్యతకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సర్వే చేబడుతుందని.. సర్వేలో పెరిక కులస్థులు అందరూ పాల్గొనాలని సూచించారు. ఎన్యుమరేటర్స్ రాకపోతే పిలిపించుకొని సర్వే నిర్వహించుకోవాలన్నారు.