హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణ విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని స్టూడెంట్స్‌కు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాచారంలోని డీపీఎస్ స్కూల్లో సోమవారం (జనవరి 20) చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ప్రారంభించారు. విద్యార్థులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ నిబంధనలను తెలుసుకునేలాగా ట్రాఫిక్ అవేర్నెస్ చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు.
విద్యార్థి దశలోనే ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. గతంలో రోడ్డు భద్రత అవగాహనపై వారోత్సవాలు ఉండేవని, ఇప్పుడు వాటి స్థానంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు తీసుకొచ్చామన్నారు. రవాణా శాఖలో కొత్తగా స్క్రాప్ పాలసీ, ఈవీ పాలసీ తీసుకొచ్చామని పేర్కొన్నారు. విద్యార్థులు ట్రాఫిక్ రూల్స్ పాటించి.. మీ తల్లిదండ్రులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
ALSO READ | గుడ్ న్యూస్: జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు
రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి స్క్రాప్ పాలసీ తెచ్చామని చెప్పారు. రోడ్ సేఫ్టీపై విద్యార్థి దశలోనే ట్రాఫిక్ అవగాహన కల్పించేందుకు పాఠ్య పుస్తకంలో ట్రాఫిక్ అవేర్నెస్పై ఒక పాఠంగా చేర్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని పేర్కొన్నారు. స్కూల్లో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటుకు సహకరించిన డీపీస్ స్కూల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా మంత్రి ధన్యవాదాలు తెలిపారు.