
- ప్రియాంక ఇచ్చిన మాటను నిలబెడతాం
- మంత్రి పొన్నం ప్రభాకర్భరోసా
హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్ మండలం కిషన్‌నగర్‌కు చెందిన జాగిరి రమాదేవి కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని మంతకరి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ తిరిగి వెళ్తూ రమాదేవిని కలిసి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రమాదేవికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు పొన్నం మంగళవారం రమాదేవి ఇంటికి వెళ్లి వారి బాగోగులు తెలుసుకున్నారు. వారికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని సూచించారు. రమాదేవిని సన్మానించి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లడారు.
మంత్రికి అగ్గిపెట్టెలో పట్టే పట్టువస్త్రం బహూకరణ
కాంగ్రెస్ హుస్నాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అగ్గిపెట్టెలో పట్టే బంగారుపూత వేసిన పట్టు వస్త్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బహూకరించారు. మంగళవారం హుస్నాబాద్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రిని సన్మానించారు.