భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ సమీపంలో కూ. 20 లక్షలతో నిర్మించనున్న ధ్యాన మండపానికి రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తండ్రి సత్తయ్య జ్ఞాపకార్థం
తన సోదరులు అశోక్, రవి చంద్ర కలిసి ధ్యాన మండపం నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలయ్య, సీనియర్ నాయకులు కొలుగురి రాజు, ఆదరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.