దమ్ముంటే కరీంనగర్ లో కేటీఆర్ పోటీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ముందు కరీంనగర్ లో తమపై గెలిచి చూపించి మాట్లాడాలన్నారు. కేసీఆర్ మానసపుత్రిక బొందలగడ్డగా మారడానికి కారణం ఎవరు చెప్పాలన్నారు. మేడిగడ్డలో ఒకట్రెండు పిల్లర్లే కుంగాయంటూ అవహేళన చేస్తున్నారని విమర్శించారు. ఇంట్లో ఒక పిల్లర్ కూలినా ఇల్లు కూలిపోయినట్లేనన్నారు.
ALSO READ :-Mad 2: స్టార్ హీరోతో మ్యాడ్ 2.. ఆయనతో వర్కౌట్ అవుతుందా!
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు పొన్నం ప్రభాకర్. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగు హామీలు అమలు చేశామన్నారు. ఇది చూసిన బీఆర్ఎస్ నేతలకు కళ్లు మండుతున్నాయని..అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారం కోల్పోయే సరికి కేటీఆర్ మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.