ఎవరెన్ని చెప్పినా నమ్మకండి.. అర్హులందరికీ 4 పథకాలు: మంత్రి పొన్నం

ఎవరెన్ని చెప్పినా నమ్మకండి.. అర్హులందరికీ 4 పథకాలు: మంత్రి పొన్నం

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను లాంఛనంగా ప్రారంభించనుంది. అయితే.. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు స్పష్టంగా విధి విధానాలు రూపకల్పన చేయగా.. రేషన్ కార్డుల గైడ్స్ లైన్స్ విషయంలో గందరగోళం నెలకొంది. ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారు. ఈ క్రమంలో రేషన్ కార్డుల జారీపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. 

బుధవారం (జనవరి 22) కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్ గ్రామంలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాలుగు పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న నేపథ్యంలో రకరకాలుగా కొందరు మాట్లాడుతున్నారు.. ఈ సందర్భంగా జాబితాలో మీ పేర్లు లేవని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు.. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండని సూచించారు.

ALSO READ | అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి ఉత్తమ్

ఎవ్వరు ఆందోళన చెందవద్దని.. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని.. ఈ సారి లిస్టులో పేర్లు రాని వారు మళ్లీ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తామని మరోసారి బలంగా చెప్పారు.