పైరవీలు ఉండవ్.. అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొన్నం ప్రభాకర్

  • అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు
  • మంత్రి పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్: అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్, ముషీరాబాద్ నియోజకవర్గంలోని 81 మంది లబ్ధిదారులకు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. 

ఈ  సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఎలాంటి, పైరవీలు, అవకతవకలు లేకుండా చూసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ స్లమ్స్ లో నివసించే వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 

ALSO READ : బీఆర్ఎస్ నోటిఫికేషన్లు ఇచ్చి పారిపోతే.. మేము నియామకాలు చేపట్టాం: సీఎం రేవంత్

ట్రాఫిక్ ను అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.  ప్రతీ పేదవాడికి సొంతిల్లు అనేది డ్రీమ్ అని  మంత్రి పొంగులేటి  అన్నారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. ప్రతీ గ్రామానికి అధికారులు వచ్చి అర్హుల వివరాలు సేకరిస్తారని చెప్పారు. పేదవాడు అయితే చాలు ఏ పార్టీ అని చూడకుండా ఇండ్లు ఇస్తామన్నారు.