మోదీ మొఖంలో భయం .. ఏ సర్వే చూసినా బీజేపీ గ్రాఫ్ డౌన్​ : మంత్రి పొన్నం

మోదీ మొఖంలో భయం ..  ఏ సర్వే చూసినా బీజేపీ గ్రాఫ్ డౌన్​ : మంత్రి పొన్నం

కరీంనగర్: ఎన్నికల వేళ ప్రధాని మోదీ మొఖంలో భయం కనిపిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.  అర్బన్ టెర్రరిజంపై పీఎం మాటలు సరికాదన్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు,  ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, మహిళలకు రూ.2500 అమలు చేస్తం. పైకి జై  శ్రీరామ్ అంటూనే.. లోపల రిజర్వేషన్లకు రామ్ రామ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నరు.  ప్రధాని మాటలు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నయ్. ​ ఏ సర్వే చూసినా బీజేపీ గ్రాఫ్ పడిపోతోంది. కేసీఆర్ ఏ పార్టీని వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి. కాంగ్రెస్ మాత్రమే దేశంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది’ అని పొన్నం తెలిపారు.