బీఆర్ఎస్​రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది: మంత్రి పొన్నం

బీఆర్ఎస్​రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది: మంత్రి పొన్నం
  • ‌‌లోకల్​బాడీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా  పనిచేయండి 
  • సంక్రాంతికి రైతు భరోసా 
  • ఇవాళ కేబినెట్​సబ్​కమిటీలో నిర్ణయం తీసుకుంటాం 
  • కోహెడ​లో కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం 

హైదరాబాద్​:  పదేండ్ల బీఆర్ఎస్​పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్​అన్నారు.  ఇవాళ  సిద్దిపేట జిల్లా కోహెడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  పార్టీ బలోపేతం కోసం కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రూ.30 వేల కోట్లు కేటాయించామన్నారు.  

ఇవాళ జరిగే  కేబినెట్‌ సబ్‌ కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటాం.  సంక్రాంతికి రైతు భరోసా,  త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు వస్తాయి.  ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా ఉంటుంది. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం.  కార్యకర్తలకు అందుబాటులో ఉంటా..  నా గెలుపుకు మీరంతా కష్టపడి పనిచేశారు.  ఈ ప్రాంతానికి ఏం ఇచ్చిన రుణం తీర్చుకోలేను.   ఎంత చేసినా తక్కువే..  త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి.. ప్రతి గ్రామంలో కాంగ్రెస్​జెండా ఎగరాలి.

ALSO READ | బీసీలను అన్యాయం చేసి గొంతు కోసిండ్రు.. బీఆర్ఎస్‎పై మహేష్ గౌడ్ ఫైర్

ఇప్పటినుంచే  వ్యూహాత్మకంగా  పనిచేయండి.  ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున్న తీసుకువెళ్లాలి.  హుస్నాబాద్​కు 250 పడకల హాస్పిటల్​ మంజూరు అయింది. ’ అని  పొన్నం ప్రభాకర్‌ అన్నారు.