విమర్శలకు హద్దులుండాలి.. పొన్నం ప్రభాకర్

విమర్శలకు హద్దులుండాలి.. పొన్నం ప్రభాకర్

మంత్రి కొండా సురేఖపై ట్రోల్స్ విషయంలో బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ నేతలు గుర్తించాలని, బాధ్యతగల ప్రతిపక్షాలు మహిళల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై విమర్శించదలుచుకుంటే ఓ హద్దు ఉండాలని అన్నారు. మహిళా మంత్రులను అవమాన పరిచేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. 

ALSO READ | ముందు హైడ్రా ఆఫీసును కూల్చండి... ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ... కేటీఆర్

ఇది మంచి పద్ధతి కాదని, రాజకీయంగా మహిళలకు 50 శాతం కోటా ఇచ్చేవిధంగా సోనియా కృషి చేసారని అన్నారు. చట్టసభల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.గతంలో తనమీద, సీతక్క మీద కూడా అవమానకరంగా మాట్లాడారని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు మంత్రి పదవులీయని వారి గురించి, చేయలేని వ్యాపారం చేసి జైలుకు వెళ్లిన మహిళల గురించి తాము మాట్లాడటం లేదని చురకలంటించారు.