గల్లీల్లో పటాకులు పెడితే ప్రమాదాలు జరుగుతాయ్​ :మంత్రి పొన్నం ప్రభాకర్​ ​

గల్లీల్లో పటాకులు పెడితే ప్రమాదాలు జరుగుతాయ్​ :మంత్రి పొన్నం ప్రభాకర్​ ​
  • అధికారుల చర్యలు చేపట్టాలె
  • అందరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలె  

హైదరాబాద్​:  జనావాస సముదాయల్లో పటాకుల దుకాణాలు లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ అధికారులను ఆదేశించారు.  ఇవాళ మంత్రి పొన్నం మాట్లాడుతూ..  పటాకుల దుకాణాల వల్ల ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  వీటి కోసం క్రీడా మైదానం, ఓపెన్​ప్లేస్​లు, స్కూల్​స్థలాలను దుకాణాలను పెట్టుకునేందుకు వాడుకోవాలన్నారు.  సిటీలోని సంబంధిత ఏరియాల ఆఫీసర్లు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.  ప్రమాదాలు నివారించడానికి అందరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు.

ఎక్కడైనా జనాలరద్దీ, నివాస సముదాయాల్లో పటాకులు అమ్ముకుంటే సంబంధిత అధికారికి స్థానిక ప్రజలు కంప్లైంట్​చేయాలని కోరారు.  ఈ విషయంలో అందరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలన్నారు.  పటాకుల దుకాణాలు చిన్నచిన్న గల్లీల్లో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ‘  ఇప్పటికే సిటీలోని అబిడ్స్​, చందానగర్​ పటాకుల దుకాణాల్లో రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి.  లక్కీగా పెద్దగా ప్రమాదం జరగలేదు.

దీపావళి పెద్ద పండుగ.  పండగను అందరం సంతోషంగా జరుపుకోవాలి.  ఈ పండుగ సందర్భంగా  టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు.  చిన్నచిన్న గల్లిల్లో పటాకుల దుకాణాలు ఏర్పాటు చేస్తే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.’ అని మంత్రి పొన్నం అన్నారు.