ఇటీవల గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వెలుగులోకి వస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యమంత్రి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు ,అడిషనల్ కలెక్టర్ లతో జిల్లా కమిటీలు వేస్తున్నామని.. ఈ కమిటీల్లో నలుగురు ఎస్సి ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు,మండల స్థాయిలో డీఎంహెచ్ఓ , డీఆర్డీవో డీపీవో , పంచాయతీ సెక్రటరీ లను సభ్యులుగా ఉంటారని తెలిపారు. ప్రతిపక్షాలు గురుకులాల మీద పాలిటిక్స్ చేయద్దని హితవు పలికారు.
ప్రతి 15 రోజులకు ఒకసారి సందర్శించడం, నివేదిక రూపొందించడం లాంటివి చేయాలని అధికారులకు సూచించారు పొన్నం ప్రభాకర్. ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశమే లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
ప్రభుత్వం కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచిందని.. గతం ప్రభుత్వ హయాంలో కిరాయిలు ఇవ్వలేక ,మెస్ చార్జీలు ఇవ్వలేక ఇబ్బందులు పెట్టారని అన్నారు. భవిష్యత్ లో గ్రీన్ ఛానెల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తామని అన్నారు. విద్యార్థులకు బట్టలు ,పుస్తకాలు అన్ని రకాల కిట్స్ ఇస్తున్నామని,విద్యార్థుల మీద రాజకీయం చేయద్దని అన్నారు. ఎస్సి, ఎస్టీ ,బీసీ మైనారిటీ లలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు పొన్నం ప్రభాకర్.