చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి: మంత్రి పొన్నం

చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి: మంత్రి పొన్నం
  • ఎంత పెద్దవారైనా చర్యలు తప్పవు

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ఎక్కడైనా చెరువులు అక్రమణలకు గురవుతున్నా, ఎవరైనా కబ్జాలకు పాల్పడుతున్నా వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రజలకు పిలుపునిచ్చారు.  జంట నగరాలతోపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఆక్రమణలున్నా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. 

ఎవరి మీద కక్షపూరితంగా, వ్యక్తిగతంగా, ఉద్దేశ్య పూర్వకంగా వ్యవహరించడంలేదని,  సమాజంలో పరివర్తన తేవాలనే ఈ చర్యలకు దిగినట్టు చెప్పారు. చెరువులు, కుంటలు ఆక్రమణల వెనుక ఎంత పెద్దవారున్నా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడాలని,  మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇది అని పేర్కొన్నారు.