కవితను విడిపించుకోవడానికి మోదీతో కేసీఆర్ బేరసారాలు : పొన్నం ప్రభాకర్

కవితను విడిపించుకోవడానికి మోదీతో కేసీఆర్ బేరసారాలు : పొన్నం ప్రభాకర్

జైల్లో ఉన్న కవితను విడిపించుకోవడానికి ప్రధాని మోదీ దగ్గర కేసీఆర్ బేరసారాలు చేస్తున్నారని  మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్  బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ను బలి పశువు చేయడానికి కేసీఆర్ సిద్ధం అయ్యారన్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీడియాతో పొన్నం మాట్లాడారు.  కార్యకర్తలు కష్టపడితే కరీంనగర్ ఎంపీ సీటును కైవసం అవుతుందని తెలిపారు.  

ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు మంత్రి పొన్నం.  ముంపు గ్రామాల సమస్యలపై కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చేసిన కేసీఅర్ ..  పదేళ్లు సీఎంగా అవకాశం ఇస్తే ఎందుకు పరిష్కారం చేయలేదని పొన్నం ప్రశ్నించారు. సిరిసిల్లకు రావల్సిన   టెక్స్ టైల్ పార్క్ ను వినోద్ కుమార్ వరంగల్ కి తీసుకెళ్ళారన్నారు.  

బండి సంజయ్ హిందువుల పేరు మీద ఓట్ల రాజకీయం చేసేది తప్ప ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యేగా ఒడిపోయిన సంజయ్ ..  సిగ్గులేకుండా మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాడన్నారు.   బండి సంజయ్ ముర్కుడని, తల్లిని బిడ్డను రాజకీయం కోసం వాడుకుంటాడని తెలిపారు.  హిందువునని చెప్పుకునే బండి సంజయ్ వేములవాడ రాజన్న గుడికి ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ నియంతృత్వ వాదని పొన్నం అన్నారు.