బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మంత్రి పొన్నం కౌంటర్ వేశారు. అసలు గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందో కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్ అసత్య ప్రచారాలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ పదవి పోయిన ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. మేం చిత్తశుద్దితో ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. తమపై ఎన్ని సెటైర్లు వేసినా పట్టించుకోకుండా తమపని తాము చేసుకుపోతామన్నారు. గత ప్రభుత్వం విదేశీ విద్యానిధి 150 మందికి ఇస్తే..తాము 500 మందికి ఇచ్చామన్నారు పొన్నం. కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత , ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.
Also Read:-వాహనాల స్క్రాపింగ్ కోసం రాష్ట్రంలో 37 టెస్టింగ్ సెంటర్లు
అంతకు ముందు రాహుల్ గాంధీపై సెటైర్ వేశారు కేటీఆర్. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలపడానికి అశోక్ నగర్ యువత ఎదురుచూస్తుందని తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతేగాకుండా టీఎస్ పీఎస్ సీని పునరుద్ధరించినందుకు, యువతకు 5 లక్షల భరోసా కార్డ్ ఇచ్చి హామీలు నెరవేర్చిన రాహుల్ గాంధీని కలడానికి యువత గ్రాండ్ వెలక్ కమ్ చెబుతుందని ట్వీట్ చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ 2023లో హైదరాబాద్ అశోక్ నగర్లో యువతను కలిసిన వీడియోను పోస్ట్ చేశారు.
Rahul Ji,
— KTR (@KTRBRS) October 9, 2024
Youth in Ashok Nagar are waiting to thank you for delivering on “2 lakh Jobs in 1 year”
Also thank you for the 5 lakh “Yuva Vikasam” assistance & revamp of TSPSC
Welcome back to Hyderabad to meet with the youngsters since your guarantee is done https://t.co/LJbagV2Kka