పాల‌నానుభ‌వం లేక కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు : పొన్నం

మాజీ మంత్రి కేటీఆర్ కు పాలన అనుభవం లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కనీసం వారం గడవక ముందే పథకాలు అమలు కావడం లేదని కేటీఆర్ మాట్లాడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. రైతు పెట్టుబడి సాయం త్వరలోనే అందిస్తామని చెప్పారు. 

తమ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామని బీఆర్ఎస్ నేతలతో ఎవరు పలికిస్తున్నారో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.  కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే భారత పార్లమెంటుపై దాడి జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని నరంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ బయలుదేరే సమయంలో గురువారం (డిసెంబర్ 14న) మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కామెంట్స్ చేశారు.