బస్సుల్లో మహిళలను కించపరిచిన...మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని జీర్ణించుకోలేకనే...ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు పొన్నం. కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్ కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొదటి నుంచి ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అవమానపరిచే.. విధంగా మాట్లాడుతున్నారన్నారు. మహిళలను అవమానపరిచే తీరును ఇప్పటికైనా కేటీఆర్ మానుకోవాలని హితవు పలికారు పొన్నం..
బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి: కేటీఆర్
మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు వేసుకుంటే తాము వద్దనట్లేదని.. అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డు డ్యాన్సులు చేసుకోవచ్చన్నారు. బస్సుల్లో మహిళలు కొట్టుకుంటున్నారని.. డ్రైవర్లు, కండక్టర్లు కూడా కొట్టుకుంటున్నారని చెప్పారు. బస్సులు ఎక్కువ పెట్టండి.. అవసరమైతే ఒక్కో మహిళకు ఒక్కో బస్సు పెట్టండని మాట్లాడారు.