సన్నబియ్యం పేదలకు వరం : మంత్రి పొన్నం ప్రభాకర్​

సన్నబియ్యం పేదలకు వరం : మంత్రి పొన్నం ప్రభాకర్​
  • పంటలను అగ్వకు అమ్ముకోవద్దు.

కోహెడ(హుస్నాబాద్), వెలుగు: సన్నబియ్యం పేదలకు వరం అని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. మంగళవారం హుస్నాబాద్​ పట్టణంలోని రేషన్ షాపులో లబ్ధిదారులకు ఆయన సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునే పరిస్థితి ఉండేదన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ర్టంలో 17,263 రేషన్​ షాపుల ద్వారా 2.91 లక్షలకు పైగా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పోతారం(ఎస్​)లో ధాన్య కొనుగోలు సెంటర్​ను కలెక్టర్​ మను చౌదరితో కలిసి ప్రారంభించారు. 

రైతులు కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కొనుగోలు సెంటర్లకు తీసుకువచ్చి మద్ధతు ధర పొందాలన్నారు. చివరి గింజ వరకు  కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫేస్1,ఫేస్​2 కింద ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాల్వలు పూర్తిచేసి పంటలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. రైతులకు ఇబ్బంది అయినా భూసేకరణకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​హమీద్, జిల్లా లైబ్రరీ చైర్మన్​లింగమూర్తి, డీఆర్డీవో జయదేవ్​ఆర్య, ఆర్డీవో రామ్మూర్తి, పీఏసీ,ఏఎమ్​సీ చైర్మన్లు శివ్వయ్య, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

దేశంలోనే మొదటిసారి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి  ప్రారంభించారు. మంగళపేట్ లోని మూడో వార్డులో రేషన్ కార్డు దారులకు సన్న బియాన్ని పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనిని తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఆనంద్ స్వరూప్ షెట్కార్, శంకర్, తాహెర్ అలీ, రమేశ్ చౌహన్, పండే రెడ్డి, సత్యం ఉన్నారు.

 సన్నబియ్యంతో పేదలకు లబ్ధి:  గిరిధర్ రెడ్డి 

జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సన్న బియ్యం పథకాన్ని జహీరాబాద్ పట్టణంలోని మూసా నగర్ కాలనీలో  రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సన్న బియ్యంతో పేదలకు లబ్ధి జరుగుతుందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్​రవీందర్, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కండెం.నర్సింహులు,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.నర్సింహారెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఎస్ సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ భీమయ్య, కాంగ్రెస్ నాయకులు రాములు, జమిలాలోద్దిన్, శుక్లనర్ధన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, అక్బర్, మల్లారెడ్డి, గుండా రెడ్డి, రాజు, ఇమామ్ పటేల్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి: పూజల హరి కృష్ణ

సిద్దిపేట రూరల్: సన్నబియ్యం పంపిణీని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరి కృష్ణ సూచించారు. మండలంలోని పుల్లూరు  గ్రామంలో రెవెన్యూ అధికారులతో కలసి ఆయన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలోజిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ, మండల అధ్యక్షుడు రాములు, కనకయ్య గౌడ్, అనిల్ రెడ్డి, వెంకట్, రామస్వామి, కనకయ్య  పాల్గొన్నారు.

సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి  

బెజ్జంకి : పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని దేవక్కపల్లిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల కడుపు నింపేందుకు  ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉగాది నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తుందన్నారు. 

దొడ్డు బియ్యంతో మిల్లర్లు, దళారులే బాగుపడ్డారని  ప్రతి ఏటా పదివేల కోట్ల దోపిడీ జరిగిందని, సన్న బియ్యం పంపిణీ తో దోపిడి బంద్ అయితదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, పార్టీ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి,  వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్​శ్రీనివాస్ రెడ్డి, ఆలయ చైర్మన్ ప్రభాకర్, డైరెక్టర్లు సంతోష్, బైర సంతోష్, రాజు, శ్రీనివాస్, నరసయ్య పాల్గొన్నారు.