వెలిచాల రాజేందర్ రావుదే విజయం : పొన్నం ప్రభాకర్

వెలిచాల రాజేందర్ రావుదే విజయం : పొన్నం ప్రభాకర్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విజయం సాధించబోతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు  పొందిన ఓటర్లకు, ఆర్టీసీలో ప్రయాణం చేసిన మహిళా ఓటర్లకు, రూ.500కే సిలిండర్లు లబ్ధి పొందిన ఓటర్లకు, భవిష్యత్తులో ఇందిరమ్మ ఇండ్లు, రూ.4000 పెన్షన్, రూ.2 లక్షల రైతు రుణమాఫీ ఆకాంక్షించి కాంగ్రెస్ కు ఓటేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.