![బండిసంజయ్ పై మంత్రి పొన్నం సెటైర్లు](https://static.v6velugu.com/uploads/2024/01/minister-ponnam-prabhakar-fire-on-bandi-sanjay_gWyx6DcrXq.jpg)
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బండిసంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడని తెలుసు కానీ జ్యోతిష్య శాస్త్రం చదివినాడని తెలియదంటూ సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బండిసంజయ్ అనడం అవివేకమని చెప్పారు పొన్నం ప్రభాకర్. గడిచిన ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్ ను ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని నలుగురు పీఠాధిపతులు కూడా వ్యతిరేకిస్తున్నారని పొన్నం అన్నారు. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సాంప్రదాయ ప్రకారం చేయాలి. అయోధ్య రామమందిరంపై బీజేపీ మార్కెటింగ్ అపాలన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారంటుూ హాట్ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ టచ్‌లో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారని సంజయ్ కామెంట్ చేశారు. బీఆర్‌ఎస్ అంటే కూల్చే పార్టీ.. బీజేపీ అంటే నిర్మించే పార్టీ అని చెప్పారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.