వేములవాడ, వెలుగు: రామ జన్మభూమి విషయంలో తప్పు మాట్లాడితే తాను సజీవ దహనానికి సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘‘రాజకీయాల్లోకి మా అమ్మ ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చావ్.. మా అమ్మ మనసు క్షోభిస్తుందని హుస్నాబాద్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద అన్నదెవరు? మళ్లీ అలా అనలేదని మా అమ్మ కాళ్లు మొక్కుతా అంటున్నావ్” అంటూ ఎంపీ బండి సంజయ్‌పై ఆయన ఫైర్అయ్యారు.
బుధవారం వేములవాడ అర్భన్ మండలం కొడుముంజలో ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్‌తో కలిసి పొన్నం భూమి పూజ చేశారు. తర్వాత నాంపల్లి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంజయ్ మాత్రమే కాదని, తాను కూడా హిందువునే అని అన్నారు. నాయకులు రాజకీయాలు మాట్లాడాలని, కుటుంబసభ్యుల గురించి మాట్లాడడం ఏమిటన్నారు.