కరీంనగర్: ఆధార్‌కార్డు లాగా రాష్ట్రంలో ప్రతి ఫ్యామిలీకి డిజిటల్కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. ఇవాళ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో తహేర్ కొండాపూర్ లో జరిగిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే డిజిటల్కార్డుతోనే గవర్నమెంట్స్కీంలన్నీ వస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుందన్నారు. ‘ రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాల్లో 288 చోట్ల ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది.
ఎంతమంది ఉన్న ఫ్యామిలీ పరంగా డిజిటల్కార్డు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. ఈ పైలెట్ ప్రాజెక్ట్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి. ఇందులో కుటుంబ ఆస్తుల వివరాలు, అడగరు. కుటుంబసభ్యుల సంఖ్య ఒక గ్రూప్ ఫోటో లాంటి వివరాలు మాత్రమే అడుగుతారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా తీసుకోవచ్చు. డిజిటల్ గుర్తింపు కార్డు ఫ్యామిలీ పెద్దగా మహిళను చేస్తున్నం. కర్ణాటక, హర్యాణా రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ డిజిటల్ కార్డులను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే అక్కడ అధికారులు పరిశీలించి అధ్యయనం చేశారు. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
గత ప్రభుత్వం రూ. లక్ష రుణాన్ని నాలుగు విడతలుగా చేశారు. మేము ఒకసారి కంప్లీట్చేశాం. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల సమస్యలను తర్వలో పరిష్కరిస్తాం. అర్హత ఉండి ఎక్కడైనా రుణమాఫీ కాకపోతే అధికారులకు వివరాలు ఇవ్వాలి. రూ. 2 లక్షల పైన ఉన్న వారికి దసరా లోపు మాఫీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించారని’ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతకుముందు తహేర్కొండాపూర్లో పలు ఇంట్లోకి వెళ్లి కుటుంబసభ్యుల వివరాలను అడిగి తెలుసుకొని, నమోదు చేశారు.