కరీనంనగర్: ఓట్లకోసమే రాముడి కళ్యాణం, పట్టాభిషేకం అక్షింతల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు, పరిశ్రమలు ఇవ్వలేదు..ఎంపీగా ఉండి బండిసంజయ్ ఏ ఒక్క పనిచేయలేదని పొన్న ప్రభాకర్ అన్నారు. బండిసంజయ్ ఓ అవినీతిపరుడు.. అలాంటివారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా పనికిరాడని పొన్న ప్రభాకర్ చెప్పారు.
మానకొండూరు మండల కేంద్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేందర్ రావు తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read: కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు
బీజేపీ ప్రభుత్వం పదేళ్లో దేశానికి, తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలన్నారు మంత్రి పొన్న ప్రభాకర్ రెడ్డి. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను 1200 కు పెంచిం దన్నా రు. ఉప్పులు, పప్పులు నిత్యావసరాల ధరలు భారీగా పెంచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర అందిస్తున్నామన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు పొన్న ప్రభాకర్.
తెలంగాణలో కేసీఆర్ డబుల బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని చెప్పి మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇండ్లు లేనివారికి ఇల్లు కట్టకునేందుకు రూ. 5లక్షలు ఇస్తామన్నారు. అక్కాచెల్లెల్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 60 వేల కోట్లు అప్పు ఉంటే.. బీఆర్ ఎస్ ప్రభుత్వం మారే సమయానికి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని అన్నారు.