ట్వీట్ చేయడానికి సిగ్గు, జ్ఞానం ఉండాలి.. కేటీఆర్‎పై మంత్రి పొన్నం ఫైర్

ట్వీట్ చేయడానికి సిగ్గు, జ్ఞానం ఉండాలి.. కేటీఆర్‎పై మంత్రి పొన్నం ఫైర్

హైదరాబాద్: గురుకుల పాఠశాలలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలో గురుకులాలను పూర్తిగా మూసివేసే కుట్ర జరుగుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు గురుకుల అద్దె భవనాలకు రూ.వేల కోట్లు బకాయిలు పెట్టి ఇప్పుడు ట్వీట్ చేయడానికి  కేటీఆర్‎కు సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిల్లలతో రాజకీయాలు చేయొద్దని.. కొంచమైనా జ్ఞానం ఉండాలని విమర్శించారు. బకాయిలు ఉన్న భవన యజమానులను తీసుకుని తన దగ్గరకు రావాలని కేటీఆర్‎కు సూచించారు.

 పదేళ్లు అధికారంలో ఉండి గురుకులాలకు సొంత భవనాలు మీరు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. మేం సమస్య పరిష్కారం చేసే పనిలోనే ఉన్నామని.. ప్రైవేట్ బిల్డింగ్ యజమానులు ప్రభుత్వంతో చెలగాటం ఆడొద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పాత బకాయిలు ఇవ్వకపోతే.. పదేళ్లుగా ఏం చేశారని బిల్డింగ్ ఓనర్లను నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు అడగలేనీ మీరు.. ఇవాళ పాఠశాలలకు తాళాలు వేస్తారా అని మండిపడ్డారు. 

ALSO READ | తెలంగాణలో గురుకులాలను మూసివేసే కుట్ర: కేటీఆర్

గురుకులాలకు తాళాలు వేయడం మంచి పద్దతి కాదని.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు ఉంటాయని.. క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకులాలు మూసేయాలనే కుట్ర జరుగుతోందన్న మంత్రి.. భవన యజమానులు వెనక వెనుక ఎవరున్న చర్యలు తప్పవని అన్నారు. ప్రభుత్వంతో భవన యాజమానులు ఇలాంటి చర్యలకు దిగడం సరికాదని.. బకాయిలు చెల్లించే బాధ్యత మాదని భరోసా కల్పించారు. కిరాయిలు చెల్లించే ప్రాసెస్ జరుగుతుంటే.. గురుకులాలకు తాళాలు వేస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు.