రంగారెడ్డి: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు ప్రభుత్వ నిర్లక్ష్యం కాదని.. ఇది ప్రకృతి విపత్తని.. ఎక్స్ వేదికగా విమర్శలు చేస్తున్న ఆజ్ఞానులు ఈ విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పరోక్షంగా కేటీఆర్‌ను విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంగళవారం జంట జలాశయాలను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..- - వరదల్లో మృతి చెందిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇప్పటివరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లిందే లేదు కానీ ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:హైడ్రా ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య అమీన్‌పూర్‌లో కూల్చివేతలు
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు సహయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని.. మీకు చేతనైతే నిధుల కోసం కలిసి పోరాడి ఫండ్స్ తెచ్చుకుందామని హితవు పలికారు. జంట జలాశయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. - ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిదేనని.. -ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడటం లేదు. వారి మాటలు నమ్మకండని సూచించారు.