ప్రభుత్వాన్ని చూడలేక కేటీఆర్కు కళ్లు మండుతున్నాయి: పొన్నం ప్రభాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వాన్ని చూడలేక కేటీఆర్ కు కళ్లు మండుతున్నాయన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని.. కేటీఆర్ మా ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకో అని పొన్నం ప్రభాకర్ అన్నారు. కేటీఆర్ విచక్షణ కోప్పోయాడని.. ఆయనకు జ్ఞానం ఉందా అని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని.. ఎవరికైనా అహంకారం ఉండకూడదన్నారు. గతంలో కేటీఆర్ మంత్రి హోదాలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తే... కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడితో సహా తమ కార్యకర్తలకు అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

కానీ తాము అలా చెయ్యలేమమ, తమది స్వేచ్ఛ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవెరుస్తామమని చెప్పారు. రాష్ట్రంను అప్పుల కుప్పగా మార్చారని.. అఖిరికి కేటీఆర్ సిరిసిల్ల మున్సిపల్ కరెంట్ బిల్లులు కట్టలేదని.. చేనేత బిల్లులు కూడా చెల్లించలేదని విమర్శించారు. 

దేశానికైనా.. రాష్ట్రానికైనా కాంగ్రెస్ ప్రభుత్వామే ఎప్పటికి రక్ష అని తెలిపారు. సిరిసిల్ల ప్రాంతంలోని సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పర్ మనేరు ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డిలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జడ్పీటీసీ నర్సయ్య, సర్పంచ్ లు, ఎంపిటీసీలు, మాజీ సర్పంచ్ లు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ తో పాటు సుమారు 400 మంది చేరారు.